ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపీఎస్
పార్కింగ్ స్థలాలు, మీటింగ్, భోజన ఏర్పాటు ప్రాంతాల పరిశీలన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి వారి ఆధ్వర్యంలో తేది :16,17 లలో 50 రోజుల దినముల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు, ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు సుమారు ఒక లక్ష యాభై వేల మంది పైగా పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్ కలిసి భద్రత ఏర్పాట్లు , బందోబస్తు ఏర్పాట్లు, హెవీ వెహికల్ పార్కింగ్ స్థలాలు, వివిఐపి వెహికల్ పార్కింగ్ స్థలాలు, భోజన ఏర్పాటు స్థలాలు, సభ వేదికలను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు ఒక లక్ష 50 వేల పైగా భక్తులు, ప్రజలు పలు ప్రాంతాల నుండి ప్రార్థనలకు, సభకు వచ్చే వాహనాలకు మరియు ప్రజలకు మరియు సాధారణ వాహన దారులకు ఎటువంటి ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా సజావుగా సాగేలాచూడాలని, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి పూర్తిస్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై, పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పెద్దపల్లి అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ఎఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్ రావు, మందమర్రి సిఐ శశి ధర్ రెడ్డి , ఆర్ఐ వామన మూర్తి, కాసిపేట్ ఎస్ఐ ప్రవీణ్ లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App