Increased responsibility by promotion Commissioner of Police M. Srinivas IPS
రామగుండం పోలీస్ కమిషనరేట్
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 06 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, వాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్ లు సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, గౌస్ , రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App