సికింద్రాబాద్ మెట్టుగూడ లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
వెంటనే స్పందించిన మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత
వాహనదారులకు ఇబ్బంది కలవకుండా ప్రమాద నివారణ చర్యలు చేపట్టిన కార్పొరేటర్ రాసురి సునీత
Trinethram News : సికింద్రాబాద్, సికింద్రాబాద్ మెట్టుగూడ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది పెట్రోల్ ట్యాంక్ నుంచి భారీగా పెట్రోల్ రోడ్డుపై పడడంతో ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి ఏర్పడింది సమాచారం అందుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి తెలుసుకొని మట్టిని తెప్పించి ఆయిల్ పై పోయించారు. అక్కడ వాహనాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధించిన అధికారులు ట్రాఫిక్ పోలీసుల తో కలసి వెంటనే ట్రాఫిక్ ను మళ్ళించడంతోపాటు ప్రమాదం పొంచి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ట్రాఫిక్ ను డైవర్ట్ చేసిన పోలీసులు పెట్రోల్ ట్యాంక్ ను సరి చేసే ప్రయత్నంలో నిమగ్నయ్యారు.