వ్యక్తిగత వివరాలు గోప్యత పాటించాల్సిందే
కుల గణన లో అనవసరమైన అంశాలు ప్రశ్నావళి నుండి తొలగించాలి ప్రభుత్వం పునరాలోచన చేయాలి
కుల గణన సర్వే వివరాలు సైబర్ నేరస్తులకు చిక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వేలో భాగంగా సేకరిస్తున్న సమాచారంలో వ్యక్తిగత గొప్యతకు భంగం కలిగే అవకాశం ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీని పై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని డిహెచ్పిఎస్
పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్ కోరారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ లో జరుగుతున్న సర్వే వివరాలు పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ కుల గణన సర్వే మంచిదే ఐనప్పటికీ కేవలం అందుకు సంబంధించిన అంశాలకే పరిమితం అవ్వాలని ఆయన సూచించారు.
అసలే రోజు రోజుకి దేశంలో, రాష్ట్రంలో వందల కొద్ది సైబర్ నేరాలు హెచ్చుమీరి ప్రజలకు చెందిన కోట్లాది రూపాయలను సైబర్ నేరస్థులు గల్లంతు చేస్తున్న నేపథ్యంలో కులగణన సందర్భంగా సేకరిస్తున్న సెల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డు తదితర వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే మరింత ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.ఇట్టి వివరాలు సైబర్ నేరస్తులకు చిక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అదే విధంగా అవసరం లేని వివరాలను ఈ సర్వేలో సేకరిస్తున్నారని, కొన్ని ప్రశ్నల వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అంశాలను బహిర్గత పర్చాల్సిన అవసరం లేదని కోర్టులు సైతం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. నాడు రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారే అన్నారు వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు, ప్రైవసీ ఆక్ట్, ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత సమచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, కాని నేడు ముఖ్యమంత్రి అవగానే ఇదే రేవంత్ కుల గణన సర్వే సేకరణ కు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రశ్నలను తక్షణమే తొలగించాలని మద్దెల దినేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App