మార్చి 17 నుండి 28 వరకు ఓపెన్ పదవ తరగతి పరీక్షలు
తేదీ : 05/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ పాఠశాల పదవ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను సార్వత్రిక విద్యపీఠం విడుదల చేయడం జరిగింది. మార్చి 17వ తారీకు నుండి 28వ తారీకు వరకు రోజు విడిచి రోజు ఉదయం 9 – 30 నుంచి మధ్యాహ్నం 12 – 30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
17వ తారీకు హిందీ, 19వ తారీఖు ఇంగ్లీష్, 21వ తారీకు తెలుగు/ఉర్దూ/కన్నడ, /ఒరియా,/తమిళం , 24వ తారీఖు గణితం, 26వ తారీకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28వ తారీకు సాంఘిఖ, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా. మార్చి 17వ తారీఖు నుండి 31 వ తారీకు వరకు రెగ్యులర్ పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App