TRINETHRAM NEWS

పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం…

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంట్ విస్తృతస్థాయి మరియు సభ్యత్వ నమోదు సమావేశం బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్
నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ నగర్ లో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ పొగాకు జయరాం చందర్ హాజరై మాట్లాడుతూ, సభ్యత్వ నమోదును గడపగడప చేర్చాలని ప్రతి గల్లీలో టిడిపి జెండా ఎగరాలని మండల స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేడు 7 నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పలువురి చేరికతో పాటు సభ్యత నమోదును చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మని రామ్ సింగ్, నేన్నెలా ఇంచార్జ్ గణేష్ సింగ్, తాండూర్ ఇంచార్జ్ దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు టి ఎన్ టి యు సి అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సి, బెక్కం వీరేందర్, నా రెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రోడ్డ బానమ్మ, మాటేటి లక్ష్మి, గుండబోయిన ఓదలు, కనకం పోచమల్లు, సుందిళ్ల స్వామి, వేల్పు కొండ నర్సయ్య, కామెర రాజబాబు, పార్టీ సీనియర్ నాయకులు రామగోని గంగాధర్ గౌడ్, గద్దెల నారాయణ, మార్కా ఎంకా గౌడ్, గైని తిరుపతి, నైతం లాలు, ఎండి కాసిం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App