TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలసి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల, రామగుండం, మరియు పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హాల్టింగ్ అందుబాటులోకి తేవాలంటూ ప్రత్యేక అభ్యర్థన చేశారు.

రైల్వే మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల కేటాయింపు మరియు హాల్టింగ్ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు హామీ ఇచ్చారు. ఈ అభ్యర్థనలు అమలు కావడం ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంత ప్రయాణికుల కోసం మెరుగైన సేవలు అందుబాటులోకి రావడంతోపాటు, స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందుతుంది అని ఎంపీ వంశీ తెలియచేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App