Chandra Babu Meetings : జనవరి 5 నుంచి టీడీపీ సభలు..29 వరకు పార్టీ షెడ్యూల్ విడుదల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి ఎలాగైనా సరే అధికారం లోకి రావాలని కంకణం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు తనయుడు నారా లోకేష్ బాబు కూడా యువ గళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇదే సమయంలో ఏపీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి మాజీ సీఎం 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవలే ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చారు.
ఆ వెంటనే జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందని ప్రకటించారు. ఇది కీలకమైన పరిణామమని చెప్పక తప్పదు. తాజాగా టీడీపీ కీలక ప్రకటన చేసింది.
జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 సభలకు ప్లాన్ చేసినట్లు పేర్కొంది. ప్రతి సభకు లక్ష మందికి పైగా హాజరు కానున్నారని వెల్లడించింది.
జనవరి 5న ఒంగోలు పరిధిలో లోని కనిగిరిలో బహిరంగ సభ ప్రారంభం అవుతుందని తెలిపింది. 7న తిరువూరు, ఆచంటలో , 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో, 10న పెద్దాపురం, టెక్కలిలో , 29 నాటికి 25 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు టీడీపీ తెలిపింది.