ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( పాడేరు ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు)
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ.
ఏజెన్సీ సమగ్ర అభివృద్ధి వ్యూహం ప్రకటించాలి.
అదానితో హైడ్రో ఒప్పందాలన్నీ రద్దు చేయాలి
.
పాడేరు బహిరంగ సభలో ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ రావు డిమాండ్,
పాడేరు ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మాణం కోసం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో 9 హైడ్రో ప్రాజెక్టులు నిర్మాణం కోసం దాదాపు 5 వేల ఎకరాలు అటవీ భూములను అక్రమంగా అదాని కట్టబట్టేందుకు ప్రభుత్వం ఒప్పందాలు చేసిందని అన్నారు. అల్లూరి జిల్లా సిపిఎం ప్రధమ మహాసభను పురస్కరించుకుని బుధవారం పాడేరు పాత బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం లోని షెడ్యూలు ఐదు నిబంధనలకు విరుద్ధంగా పెసా చట్టాన్ని ఉల్లంఘించి గ్రామసభలు నిర్వహించకుండా భూమిని అదానీకి కట్టబట్టేందుకు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసిందన్నారు. ఇది చట్ట విరుద్ధమైనదని అన్నారు. గ్రీన్ విద్యుత్తు ఉత్పత్తి పేరుతో అల్లూరి జిల్లాతో సహా అనేక జిల్లాల్లో వేలాది ఎకరాలు పదానికి కట్టబెట్టేందుకు, అధిక ధరలు పెట్టి విద్యుత్ ఒప్పందాలను చేసుకున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోకుండా గుడ్డిగా వీటిని ఆమోదించిందని చెప్పారు. దీని రీత్యా విద్యుత్తు ట్రూఅప్ చార్జీలు పేరుతో పెంచిన ధరలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, చార్జీలను పెంచి నియోగదారులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెట్టడానికే ఈ ఒప్పందాలన్నీ జరిగాయని ఆయన విమర్శించారు. నాడు స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయాలని చెప్పి నేడు పెట్టుకోమని చెప్పడం ఆదానీ కి దోచిపెట్టడానికేనని విమర్శించారు. మోడీ చెప్పడం వల్లే అదానీతో ఒప్పందాలన్నీ చేసామని మాజీ సీఎం జగన్ బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. ఈ ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి దాచిపెట్టి అదాని అక్రమాలను కొమ్ము కాయడానికి రాష్ట్రంలోని కూటమి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అదానీ కుంభకోణం బట్టబయలు అయిన నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందాలన్నీ రద్దు చేయాలన్నారు. పెంచిన ట్రూ అప్ చార్జీలు స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని అవినీతిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయని ప్రజలు దీనికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు హామీతో నిరుద్యోగుల నిరీక్షణ,
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలతో తమకు బాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశగా నిరీక్షిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీకి నేటికీ అతిగతి లేదన్నారు.
జీవో నెంబర్ 3 రద్దు పై ఆదివాసి నిరుద్యోగుల్లో నిస్పృహ అలుముకుందని, ఎన్నికల సభల్లో దీన్ని పునరుద్ధరిస్తామని బాబు ఇచ్చిన హామీలపై ఎటువంటి చర్యలు లేవని అన్నారు. మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి డీఎస్సీ కూడా నిర్వహించి గిరిజనులకు న్యాయం చేయకుంటే వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారో నని ప్రజలు ఎదురుచూస్తున్నారని దీనిపై షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని పి వి టి జి గిరిజనుల పథకాలను మోడీ ఊడగొట్టారని, డోలిమోతలతో ఆదివాసి మరణాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీకొక ఫీడర్ అంబులెన్స్ పెట్టి ఈ పరిస్థితిని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేని వెనుకబడిన జిల్లాగా అట్టడుగున ఉన్న అల్లూరి జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఎం ప్రధమ మహాసభలో భవిష్యత్ పోరాటాలపై ఒక ఉద్యమ ప్రణాళికను రూపొందించనున్నామని ఆయన వెల్లడించారు.
ఆదివాసి వ్యతిరేకి బిజెపి .
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాథం మాట్లాడుతూ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకని, 11 ఏళ్ల నుంచి ఆదివాసీలపై బిజెపి యుద్ధం చేస్తోందని రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ కు భిన్నంగా మార్పులు చేస్తోందని విమర్శించారు. ఎన్నో అభివృద్ధి పథకాలను ఆదివాసీలకు దూరం చేసిందని జీవో నెంబర్ 3 రద్దుకు కారణం బిజెపి ప్రభుత్వమేనని మన్యం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల వినాశనానికి కొరుక్కుంటే సిపిఎం ఊరుకోదని అన్నారు. ఆదివాసీలకు అండగా సిపిఎం పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జిల్లాలోని ఆ పార్టీ నాయకులకు జిసిసి,ఆర్టిసి చైర్మన్ ల పదవులు ఇచ్చిందని గిరిజనులు పండించే కాఫీకి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని అన్ని ఉత్పత్తులను జిసిసి ద్వారా కొనుగోలు చేసి వారికి మేలు చేయాలని అలాగే చింతపల్లి, అరకు ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేయించాలని అన్ని ప్రాంతాలకు బసౌకర్యాలు పెంపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App