On the orders of Ramagundam MLA Raj Thakur, Mayor Bangi Anil Kumar under the leadership of Congress President Bonthala Rajesh
ఆర్ ఎఫ్ సి ఎల్ సి.జి.ఎం.ఉదయ్ రాజ్ హంసన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి
స్థానికేతరులను ఆర్ ఎఫ్ సి ఎల్ కంపెనీ నుండి తొలగించి వారి స్థానంలో స్థానిక యువతకు 80% ఉద్యోగాలు కల్పించాలని డిమాండు నోటీసు పత్రాన్ని అందజేశారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అనంతరం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడుతూ,
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశతో స్థానిక యువత మరియు ప్రజాప్రతినిధుల ఆందోళనల ఫలితంగా ఇంతకుముందు మూతపడిన ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎఫ్ సి ఎల్ పేరుతో పునఃప్రారంభించబడితే, స్థానిక కర్మాగారంలోని అన్ని చోట్లా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించి,
ఈ ప్రాంత నిరుద్యోగ యువతను ఆగం చేశారని మరియు రామగుండంలో ఫ్యాక్టరీ పునఃప్రారంభ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్థానికేతరులకు యాజమాన్యం ఉద్యోగాలు కల్పించిందని,
స్థానికుల నుండి భూములు తీసుకోవడమే కాక ఫ్యాక్టరీ నుండి వెలువడే కలుషితమైన నీరు, గాలి మరియు ఇతర ప్రమాదకరమైన వాయువులు పీలుస్తున్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ,
ఈ సందర్భంలో స్థానికేతరులందరినీ కర్మాగారం నుండి తొలగించి స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన తదుపరి చర్యలు అక్టోబర్ 1, 2024 లోపు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆ తర్వాతి రోజు నుండి స్థానిక నిరుద్యోగ యువతకు ఆర్ ఎఫ్ సి ఎల్ లో 80% ఉద్యోగాలు వచ్చేంత వరకు శాంతియుతంగా దశల వారిగా ఆందోళనలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించామని అన్నారు..
వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.