TRINETHRAM NEWS

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల {ఎంజేపీటీబీసీరెస్ } కామన్ డైట్ మెన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన

కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం ఉన్నటువంటి మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల కామన్ డైట్ మెన్ ప్రారంభ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే అనివార్య కారణాల వలన హాజరు కానందున ఎమ్మెల్యే అదేశాలతో వారి ప్రతినిధిగా రామగుండం కార్పొరేషన్ ఫోర్ లీడర్ మహంకాళి స్వామి పాల్గొని కామన్ డైట్ మెన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే ఢిల్లీ లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 10 సంవత్సరాలుగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచమని అటు విద్యార్థుల తల్లిదండ్రులు అయినా మీరు , ఇటు మా రాజ్ ఠాకూర్ మరియు మేము అందరం ఆయాల్లా పోరాటం చేసినం అయినా కూడా విద్యార్థుల గురించి పట్టించుకున్న దాఖలు లేవు కానీ

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల బౌసత్ కోసం, వారికి మెరుగైన విద్యను అందించేందుకు , విద్యార్థులు కేవలం విద్యపైన నే దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్ ఛార్జీలు భారీగా పెంచడం జరిగింది అని తెలియజేసారు

సంవత్సరా కాలంలోనే సుమారుగా 100 నుండి 200 ల శాతం చార్జీలు పెంచడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగం కు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు

ప్రైవేట్ పాఠశాలలో బోధించే ఉపాద్యాయుల కన్న మీరు ఉన్నతమైన వారు కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగం సంపాదించి విద్యను అందిస్తున్నారు

కాబట్టి ఉపాధ్యాయులకు నదొక సూచన మీరు శ్రద్ధగా బోధించి ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కన్నా మెరుగైన విద్యను అందిస్తున్న తరుణంలో మీకు శుభాకాంక్షలు

ఎమ్మెల్యే దృష్టికి సీసీ రోడ్డు సమస్య గురించి చెప్పడం జరిగింది , ఎమ్మెల్యే వెంటనే స్పందించి సీసీ రోడ్డు వేయడం జరిగింది

ఇంకా ఈ పాఠశాలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్న గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనిరండి, రామగుండం లో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి ఉత్సాహవంతులకు ఎమ్మెల్యే అనేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు , విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలియజేసారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App