Officials should be prepared to conduct counting as per rules
కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
రామగిరి, మే -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు
మంగళవారం కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జే.అరుణ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొన్నారు
కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జూన్ 4న ఉదయం 8 గంటలకు జేఎన్టీయు కళాశాల నందు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు
కౌంటింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలను గుర్తుంచుకోవాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికీ ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దని అన్నారు
కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన తనిఖీ నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతి ఒక్కరూ తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, కౌంటింగ్ ఏజెంట్లతో ఎటువంటిసంభాషణలు పెట్టుకోవద్దని, ప్రశాంతంగా వ్యవహరించా లని అన్నారు
స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు ముందస్తుగా కంట్రోల్ యూనిట్ లను హమాలీలు తీసుకుని వస్తారని, ప్రతి 2 టేబుళ్ళకు ఒక హమాలీ ఉంటారని, వారికి డ్రెస్ కోడ్ ఉంటుందని, ప్రతి టేబుల్ వద్ద వారికి కేటాయించిన కంట్రోల్ యూనిట్లు మాత్రమే చెక్ చేసి కౌంటింగ్ చేయాలని అన్నారు
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి 3 రిజర్వ్ బృందాలు,3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు
కంట్రోల్ యూనిట్ లెక్కింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ పూర్తిగా చెక్ చేసుకోవాలని, కంట్రోల్ యూనిట్ యొక్క పింక్ సీల్, గ్రీన్ ఫీల్డ్ చెక్ చేసి కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలని, కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు సరి చూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్ ను సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు
కంట్రోల్ యూనిట్ లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని, కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని అన్నారు
కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు ట్యాలీ చేసుకొని రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపించి వాటిని నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలని, 14 టేబుల్ వద్ద కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఆ రౌండ్ వివరాలు సహాయ రిటర్నింగ్ అధికారి వెల్లడించిన తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటింగ్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు
కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వివి ప్యాట్ల లెక్కింపు ప్రారంభమవు తుందని , వివి ప్యాట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు
అనంతరం సర్వీస్ ఓటర్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన పది మంది ఆపరేటర్లతో పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి
ఈ.టి.పి.బి.ఎస్ విధానం ద్వారా సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించా లని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి బి.గంగయ్య, మంథని రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్, కౌంటింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App