బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు..
లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది..