ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ మరియు బేసిక్ పే అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
21 నవంబర్ 2024
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) కు చెందిన అల్ క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్స్ ఫిక్సేషన్ చేసి, బేసిక్ వేతనం నవంబర్ 23వ తేదీ లోపు జీవో రిలీజ్ చేయాలనీ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పత్రిక ప్రకటనలో కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వైద్యులను రెగ్యులర్ చేసిన విధంగానే మిగతా ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగుల యొక్క బేసిక్ వేతనం అనగా సమాన పనికి సమాన వేతనం 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం ఆల్. క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్స్ ఫిక్సేషన్ చేసి, బేసిక్ వేతనం అమలు చేయాలని గతంలో పోయిన నెల అక్టోబర్16 న మహా ధర్నా చేసి కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన కమిషనర్ నుంచి రాకపోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నామునీ మీడియా ప్రకటనలో తెలియజేశారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో కలిసి కార్యచరణ దిశా దశ తెలియజేస్తామని చెప్పారు.. ఎన్ హెచ్ ఎం అల్ క్యాడర్స్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని , ఉద్యోగితోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలలో ఎన్ .హెచ్.ఎం. ఉద్యోగులను క్యాడర్ వైస్ గా విలీనం చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతినెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరికీ వెయిటేజ్ ఇవ్వాలని అది కూడా 20 నుంచి 30 కి పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది,సంవత్సరానికి ప్రతి ఒక్కరికి 35 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణించినట్లయితే వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని, 65 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ప్రకటించి వారికి నెలకు పెన్షన్ 25 వేల రూపాయలు ఇవ్వాలి, దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను పలు రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్ చేసిన రాష్ట్రాలు హర్యానా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ , మహారాష్ట్ర , ఒడిస్సా చేశారు. అదే మాదిరిగా ఎన్ హెచ్ ఎం అల్ క్యాడర్స్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో కూడా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. నవంబర్ 16 తేదీలోపు చేస్తానని కమిషనర్ హామీ మేరకు ఒక నెల మీద పది రోజులు సమ్మె వాయిదా వేయడం జరిగింది. ఈనెల నవంబర్ 23వ తేదీ లోపు ప్రభుత్వాధికారులు వెంటనే క్యాడర్ ఫిక్సేషన్, బేసిక్ పే వేతనాలు జీవోను విడుదల చేయకుంటే ఉద్యోగులందరూ ప్రతి జిల్లాలో డిస్టిక్ కలెక్టరేట్ ముందట (లేదా)డి.ఎం. అండ్.హెచ్.ఓ కార్యాలయం ముందట తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో సమ్మెలో పాల్గొంటామని సమావేశంలో తెలియజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App