TRINETHRAM NEWS

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన భవనాలను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానం ను తీసుకొచ్చి, 1 లక్ష 30వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రతి సంక్షేమం ను గడప ముందుకు తీసుకొచ్చిన,ఎలాంటి సమస్యలు అయిన మీ గ్రామాలంలోనే పరిష్కార అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం లో ఎలాంటి సమస్య లు అయిన మండలం లో ఉన్న మండల కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరాగాల్సిన అవసరం ఉందని, నేడు అలాంటి పరిస్థితి లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ నవరత్న పథకాలు అందాలని నేరూగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమజేస్తున్నాం అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. అలాగే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం లో పెన్షన్ ను 1000 రూపాయలు ఇస్తే ఈనాడు ఆ పెన్షన్ ను 3000 రూపాయలకు పెంచుకుంటూ వచ్చి, అర్హులైన వారందరికీ ప్రతినెల 1వ తారీఖున తెల్లవారుజామున వాలంటీర్లు ఇంటి వచ్చి మరి పెన్షన్ ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆనాడు సుపరిపాలన అందిస్తే, నేడు వారి బిడ్డగా మరో ముందు వేసి ప్రజలకు మరింత చేరువ గా పాలన విధానంలో నూతన ఓరవడిని తీసుకొచ్చింది వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం లోకి వస్తే పేదవారు ధనికులు అవాతారని పెత్తందారులు అందరూ ఒక్కటౌతున్నారని తెలిపారు. ప్రజలు గమనించాలి అభివృద్ధి కి, సంక్షేమం కు ప్రజా మద్దత్తు తెలపాలని కోరారు.