TRINETHRAM NEWS

దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్‌1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా, తెలంగాణలోనూ ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొవిడ్ రోగులు ఎప్పుడు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.