TRINETHRAM NEWS

కుల గణన సర్వేతో సరికొత్త వెలుగు

సమాజంలో సమానత్వం దిశగా సాటిలేని అడుగులు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే జరుగుతుంది
సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో సంపూర్ణ వివరాలు
ఎన్యుమరేటర్లు గా ఉపాధ్యాయ సేవలు
సామాజిక సర్వేతో ఉదాత్తమైన లక్ష్యం సాకారం అవుతుంది

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్,కే గార్డెన్స్ లో పెద్దపల్లి డిసిసి అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ కలిసి కుల గణన సమగ్ర కుటుంబ సర్వే పై పెద్దపల్లి జిల్లా స్థాయి విస్తృత మరియు రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై సమగ్ర కుల గణన ద్వారా ఇంటింటి సర్వే అవశ్యకతను అలాగే ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల విధంగా కుల గణన చేసి ఎన్రోల్మెంట్ అధికారులతో ప్రతి ఇంటికి గడప కి వెళ్లి సమగ్ర సర్వే అంశాలను నాయకులకు, కార్యకర్తలకు వివరించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
అనంతరం ఎమ్మేల్యేలు పలు కుల సంఘాల నాయకులు, మేధావులు కుల గణన పట్ల సలహాలను సూచనలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ప్రాధమిక వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు ఈర్ల స్వరూపా, మినుపాల ప్రకాష్ రావు, పట్టణ కౌన్సిలర్లు, రామగుండం కార్పొరేటర్లు, మంథని నాయకులు, పలు కుల సంఘాల నాయకులు , సభ్యులు, మహిళా సోదరీమణులు, మరియు పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App