N. H.M. All contract outsourcing employees should be regularized immediately
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా సమావేశం సిపిఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఏఐటీయూసీలో నూతనంగా ఎన్ హెచ్ ఎం 150 మంది చేరిక, ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు ప్రతి ఒక్కరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అధ్యక్షత జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తామని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. నూతన మంచిర్యాల జిల్లా నూతన కమిటీ సమావేశం సిపిఐ కార్యాలయం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో దాదాపు 17 వేల మంది పనిచేస్తున్నారు అని తెలిపారు వీరంతా వివిధ కేటగిరీల్లో పని చేస్తున్నారని తెలిపారు పని భారం ఎక్కువ వేతనం తక్కువతో సమస్యలతో సతమతమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేంతవరకు కలసికట్టుగా పోరాటాలు చేద్దామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
వైద్యులను ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా రెగ్యులర్ చేశారని అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులకు ఒక న్యాయం చిన్న ఉద్యోగులకు మరొక న్యాయమా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, దేవన బోయిన బాపు యాదవ్ , కలందర్, మహేందర్ ,డాక్టర్ . జానపాటి శరత్ బాబు, డెవలప్, అప్సర, సందీప్, , సరితా, సంధ్య, రాణి , దేవా, మహేందర్, రాజు గౌడ్, కీర్తి కీర్తి , అంజలి ,సౌమ్య శ్రీమంజుల , తదితరాలు పాల్గొన్నారు.
నూతన జిల్లా కమిటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మేకల దాసు (ఏఐటియుసి) జిల్లా అధ్యక్షుడు జీ.రాజు, ప్రధాన కార్యదర్శి దేవనబోయిన బాపు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మధు బాబు, వైస్ ప్రెసిడెంట్లు రాజ్ కుమార్ కే .ధనలక్ష్మి, కోశాధికారి ప్రవీణ్య, జాయింట్ సెక్రెటరీ జాడి కళావతి, జాయింట్ సెక్రెటరీ వేల్పుల అప్సర, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శివ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కీర్తి, సుమన్ , మురళి, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ గా ప్రవళిక తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App