TRINETHRAM NEWS

Trinethram News :

మున్సిపల్ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు చేస్తున్న నిరసన నిరసన కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మరియు జనసేన పార్టీ కోఆర్డినేటర్ నామన వెంకట శివన్నారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సైనికులు సంఘీభావం తెలిపారు

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేసిందని ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు పట్ల కూడా నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని అన్నారు

మున్సిపల్ కార్మికుల డిమాండ్లలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, హెల్త్ అవలెన్స్ ఇవ్వాలని అన్నారు

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తలను, మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అన్నారు

నియోజవర్గంలో లక్ష అరవై వేలకు పైగా జనాభా ఉంటే పారిశుద్ధ కార్మికులు సుమారు 140 మంది మాత్రమే ఉన్నారని వెంటనే సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు

పేరుకేమో జిల్లా తెచ్చానని చెప్పుకుంటూ కొంతమంది పారిశుద్ధ కార్మికులను అధికారులు, నాయకులు తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారని దీనివలన సిబ్బంది కొరత ఏర్పడడంతో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం నిల్వ ఉంటుందన్నారు

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడి కార్యకర్తలను, పారిశుద్ధ కార్మికులను, మున్సిపల్ కార్మికుల న్యాయం పరమైన డిమాండ్లన్నిటిని నెరవేరుస్తామని అన్నారు

జనసేన పార్టీ కోఆర్డినేటర్ నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ…

జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలోనే ప్రజల సమస్యలు తీరతాయని అన్నారు

జిల్లా తెచ్చామని చెప్పుకుంటున్న నాయకులు నేడు ప్రజల సమస్యలు పట్టించు కోవడం లేదు అన్నారు

సైకో ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ఈ వైసిపి ప్రభుత్వం లో చెత్త మీద కూడా పన్ను వేసి నా ముఖ్యమంత్రి నేడు జీతాలు ఎందుకు పెంచడం లేదన్నారు

మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, హెల్త్ అవలెన్స్ ఇవ్వాలని అన్నారు

ఈ కార్యక్రమము లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు