రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.లక్ష విరాళం
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో ప్రకటించిన మేరకు విరాళం
విద్యార్థుల అవసరాలకోసం వినియోగించాలని ఎమ్మెల్యే సునీత సూచన
రాప్తాడు మండలం త్రినేత్రం ప్రతినిధి
రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఇటీవల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. ఈసమావేశంలో విద్యార్థుల అవసరాలకోసం లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ స్థానిక పంచాయతీ సర్పంచ్ సాకే తిరుపాల్, కన్వీనర్ కొండప్ప సమక్షంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివరావు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ డబ్బును పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం వినియోగించాలన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొళ్లి పరిష్కరిస్తామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని.. ప్రభుత్వం తరుఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే సునీత అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App