Ministers as a team, captain himself.. Jaggareddy sensation
Trinethram News : హైదరాబాద్: తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో టీమ్ ప్రజల కోసం పనిచేస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డిపై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేకున్నా.. ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ తెల్లని కాగితం వంటి వారని, అనవసరంగా ఎందుకు ఇంకు చల్లుతారని ప్రశ్నించారు. బట్ట కాల్చి ఉత్తమ్ మీద వేయడం కరెక్ట్ కాదని మహేశ్వర రెడ్డికి సూచించారు. ఉత్తమ్‌ను ఇబ్బంది పెట్టడంలో మహేశ్వర రెడ్డికి ఒనగూరే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
బీజేఎల్పీ నేత అయినప్పటికీ మహేశ్వర రెడ్డికి తగిన గుర్తింపు లభించలేదని జగ్గారెడ్డి విమర్శించారు. గుర్తింపు కోసమే ఉత్తమ్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసే ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టాలని సవాల్ విసిరారు. లేదంటే సైలెంట్‌గా ఉండాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App