TRINETHRAM NEWS

మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క

కోకిల డిజిటల్ మీడియా
హైదరాబాద్:ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 18
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళను తలపిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ల సౌకర్యం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.

అలాగే ఈ సారీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచామన్నారు.

ఇప్పటికే తెలంగాణలోని బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. అయితే జాతర సమయంలో ఈ ఫ్రీ బస్ సర్వీస్ వర్తిస్తుందో లేదో అని సందేహం నెలకొంది.

దీంతో మేడారం లో జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత మంత్రి క్లారిటీ ఇచ్చారు.