TRINETHRAM NEWS

Medchal District Collector Gautham visited Bharat Biotech and Biological Nee

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

తెలంగాణా ప్రభుత్వము
సమాచార పౌర సంబంధల శాఖ
మంగళవరం రోజున జీనం వ్యాలిలోని కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ బయోటెక్, బయోలాజికల్ ఇ లిమిటెడ్ ను సందర్శించినా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు.
వ్యక్తిగత ఆరోగ్యం, పర్యావరణం పై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా సురక్షితమైన ఔషధాలు తయారు చేయాలని ఫార్ము సంస్థలకు సూచించినారు.
ప్రామాణిక ఆపరేటింగ్ విధానంలో ఔషధాల తయారీలో క్రమబద్ధమైన పద్దతిలో పరిశోదనలు చేస్తూ వాటి యొక్క నాణ్యత పరమైన ప్రమాణాలను పాటిస్తూన్న తీరును పరిశీలించినారు. ప్రపంచ స్థితిగతులకు అనుగుణంగా ఔషధాలు తయారి చేయడం పై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఔషధాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాలన్నారు.
ప్రపంచ నిర్దిష్ఠ ప్రమాణాల నిబందనల అనుగుణంగా ఔషధాలు తాయారు చేయలన్నారు. నూతన ఔషధాల ఆవిష్కరణ విధానములో చేయుచున్న పరిశోధనలను మరింతగా అభివృద్ధి చేయాలన్నారు. ఉత్పత్తియైన ఔషధాలను తరచుగా నాణ్యత పరమైన తనిఖీని (క్వాలిటీ కంట్రోల్ ) నిర్వహించాలన్నారు.
ఔషధాల తయారీలో బాగంగా డ్రగ్స్ ను శుభ్రపరచడం, స్టెరిలైజేషన్ & నాన్ స్టెరిలైజేషన్, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్బముగా తెల్పినారు.
ఔషధాలలో ఉత్పత్తి కోసం వివరణాత్మకమైన పరిశోధన మరియు అభివృద్ధి కై చర్యలు చేపట్టాలని ఔషధాల నిల్వ మరియు రవాణా కోసం అంతర్జాతీయ ప్రమాణాల చర్యలు తీసుకోవడంకై నైపుణ్యాలను పెంపొందించడానికి ఉద్యోగులకు తరచుగా శిక్షణ ఇవ్వాలి. ఔషధాల నిల్వల కోసం నాణ్యత పరమైన తగు భద్రతా చర్యలు, ఊహించని ప్రమాదాల సమయంలో ఉద్యోగుల పట్ల భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔషధాల ఉత్పత్తిని పెంచి సామాన్య ప్రజలకు వ్యయబారం కాకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమములో పాల్గొన్న అధికారులు ప్రశాంత్ కుమార్, జనరల్ మేనేజర్ డిఐసి, కె. చంద్ర శేఖర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్, ఎం.వి.వెంకటశేఖర్, జి. సాయి కృష్ణ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ లు, TSIIC అధికారులు: అనురాధ, జోనల్ మేనేజర్, డి వినయ్ కుమార్, IALA కమిషనర్ మరియు కంపెనీ ప్రతినిధులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Medchal District Collector Gautham visited Bharat Biotech and Biological Nee