TRINETHRAM NEWS

ఎన్టీపీసీ గోదావరిఖని బజార్ బందు జయప్రదం చేయండి

రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఎన్టీపీసీ లో లక్ష్మీనగర్లో రోడ్డు వెడల్పుతో కూల్చివేతలకు గురి అయ్యే చిరువ్యాపార సంస్థలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 03 వ తేది మంగళవారం గోదావరిఖని, ఎన్టీపిసిలో జరిగే బజార్ బంద్ వ్యాపారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం లక్ష్మి నగర్ లో మాజీ ఎమ్మెల్యే బజారు బంద్ విజయవంతం చేయాలని వ్యాపారులను కొరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని, ఎన్టీపిసి లో పాలకుల అభివృద్ధి పేరిట విద్వసం సృష్టిస్తూ వ్యాపారులను, చిరు వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వారి వ్యాపార సంస్థలను కూల్చివేయడం దుర్మార్గం అన్నారు.
చిరువ్యాపారులకు న్యాయం జరిగేంతా వరకు పోరాడుతని మంగళవారం బజరుబంద్ కు వ్యాపారులు ప్రజలు పాల్గొని జయపద్రం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో కార్పోరేటర్లు గాదం విజయ జనగ కవిత సరోజినీ బాదె అంజలి బిఆర్ఎస్ నాయకులు మూల విజయ రెడ్డి చల్లా రవీందర్ రెడ్డి నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ జడ్సన్ తిమెాతి ఇరుగురాళ్ల శ్రావన్ చింటూ ముద్దసాని సంధ్యా రెడ్డి ఆవునూరి వెంకటేష్ స్వప్న రాము తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App