Mahardasa for Vijayawada Airport
Trinethram News : కృష్ణా జిల్లా: గన్నవరంలోని విజయవాడ ఎయిర్ పోర్టు ఇప్పుడు ప్రయాణీకులతో కలకలలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయాణీకుల సంఖ్య నెలకు లక్ష దాటిందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్ పోర్టు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కనెక్టివిటీని పెంచుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా మాత్రమే ఢిల్లీకి డైరెక్టు విమానాలు నడిచేవి. ఇప్పుడు ఇండిగో సంస్థ కూడా డైరెక్టు సర్వీసులను ప్రారంభించింది. కొత్త టెర్మినల్ భవన నిర్మాణం గతంలో నత్తనడకన జరిగినా.. ఇప్పుడు ఊపందుకుంది.
విజయవాడ ఎయిర్ పోర్టుల్లో మూడు నెలల్లో నాలుగు కొత్త సర్వీసులు ఏర్పాటయ్యాయి. 2014 చంద్రబాబు అధికారంలోకి రాకముందు విజయవాడ ఎయిర్ పోర్టు చాలా చిన్నదిగా ఉండేది. రైతులు భూములిస్తే చంద్రబాబు దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా భాద్యతలను చేపట్టాక విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధిని అటకెక్కించారు. 2019కి పూర్వం 32 ఫైట్లు ఉంటే.. రాజధానిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వాటిని 24కు తగ్గించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి 75 సర్వీసులు ఉంటే.. వాటిని ఈ మూడు నెలల్లో 159కి పెంచారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App