TRINETHRAM NEWS

మా అడగరపల్లి గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయండి మహాప్రభో.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జీ కె వీధి మండలం ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్త వీధి మండలం, అడగరపల్లి పంచాయితీ, అడగరపల్లి గ్రామానికి ప్రధాన రహదారి నుండి సుమారు, రెండు కిలోమీటర్లు దూరం సరైన రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా దారి పొడవునా అంత బురద మయంగా ఉంటుంది. కాలినడకకు కూడా ఇబ్బంది పడి వెళ్లాల్సి వస్తుంది. ఈ దారి గుండ సుమారు ఏడు గ్రామాల గ్రామస్తులు డొలిమోతలతో కాలినడకన చాల దూరం నడవాల్సి వస్తుంది. ఈ రెండు రోజుల తుఫాను కారణంగా ఈ విధంగా ఉంటే, వర్షాకాలంలో అయితే మరీను. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. ఈ గ్రామంలో స్కూల్ కి టీచర్ వచ్చి పాఠాలు చెప్పాలన్న చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున మా ఇబ్బందులను ప్రభుత్వం గ్రహించి , మా గ్రామాలకు తారు రోడ్డు వేయాలని ప్రభుత్వం వారిని, ప్రాధేయ పడుతున్నాము. అని ఈ ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి సీనియర్ నాయకులు, గుండ్ల రఘువంశీ, వనపల ఈశ్వర్ రావు, కూడ మధు, పూజారి వెంకట్, పాంగి శ్రీను, ఎన్డీఏ నాయకులు గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App