ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్
Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కోవడంపై ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. భయపెట్టి అత్యధిశాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App