కలుషిత నీరుతో బ్రతకడమా? చావడమా?
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పారిశ్రామిక ప్రాంత సమీపంలో ప్రవహించే జీవనది ఐన గోదావరి నది లో వివిధ పరిశ్రమల వ్యర్ధాల ద్వారా వస్తున్న రసాయనాలు కలిసి విషపూరితమైన నీరు చేరుకొని ప్రవహిస్తుందని, దీని వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని మద్దెల దినేష్ పేర్కొన్నారు.
స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఏళ్ల తరబడి కాలుష్య నియంత్రణ అధికారులకు అనేక సార్లు చెప్పినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేయడం వారికి అలవాటు గా మారిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు జీవనది ఐన
గోదావరి నది లొకి ప్రవహిస్తున్న ప్రమాదకరమైన కలుషిత విషపు నీరు పై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ శాఖ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా కలెక్టర్ ట్విట్టర్ X ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని దినేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App