సిపిఎం నాయకులు పై దాడి చేసిన గిరిజన నేతరుడికి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలి.
అల్లూరి జిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, అనంతగిరి మండలం భింపోలు పంచాయితీ చర్యపల్లి రెవిన్యూ పరిదికి చెందిన సర్వే నవంబర్ 66 లో13 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని విటోరి రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని బీ నగేష్ జనవరి 3 తేదిన ఆక్రమించి సదును చేస్తుండగా, రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేసినందుకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడి సిపిఎం నాయకులైన జేష్ఠ రమణ, ఆర్.శ్రీను, పై గుండాలతో రాత్రి దాడి చేసి గాయ పర్చారు
తక్షణమే వెటోరి రియల్ ఎస్టేట్ వెంచర్ యజమాని బీ.నగేష్ పై ఏస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు
13 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమించిన గిరిజ నేతర భూ స్వామిపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆక్రమించిన భూములు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చెయ్యాలని డిమాండ్ చేశారు.
గిరిజనులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములను మైదానవాసులు అక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేస్తూ భౌతికంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి స్థానికంగా ఉన్న గిరిజనులపై భౌతిక దాడి, అత్యాయత్నం చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమండ్ చేశారు
ఈ ప్రకటన సందర్భంగా సిపిఎం పార్టీ అరకు మండల కార్యదర్శి కిండంగి రామారావు, అర్జున్, తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App