TRINETHRAM NEWS

Kotamreddy target Nellore fort

Trinethram News : నెల్లూరు : శాసనసభ ఎన్నికల్లో నెల్లూరును తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగిరేసేందుకు పావులు కదుపుతున్నాడట. నెల్లూరు కార్పోరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం స్రవంతి కొనసాగుతున్నది.

కోటంరెడ్డి కోటరీకే చెందిన స్రవంతి కోటంరెడ్డితో పాటే టీడీపీ కండువా కప్పుకుంది. ఆయితే ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపుతో ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరింది. ఆమె భర్త జయవర్దన్ ఎన్నికల సమయంలో కోటంరెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశాడు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు తర్వాత తిరిగి టీడీపీలో చేరేందుకు స్రవంతి ప్రయత్నాలు చేస్తున్నా కోటంరెడ్డి అడ్డుపడుతున్నాడట.

నెల్లూరుకే చెందిన నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో స్రవంతి భర్తి మీద ఉన్న ఫోర్జరీ కేసుల నేపథ్యంలో నెల్లూరు కార్పోరేషన్ చైర్మన్ గా స్రవంతిని తప్పించి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను గద్దెను ఎక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఫోర్జరీ కేసుల నేపథ్యంలో మేయర్ తో రాజీనామా చేయించడం, లేదా సెలవు పంపించేందుకు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

నెల్లూరు మేయర్ ఎన్నికల్లో 56 కార్పోరేటర్ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికలకు ముందు తరువాతి పరిణామాలలో అందులో 29 మంది టీడీపీ గూటికి చేరారు. మరింత మందిని ఇటువైపు లాగి కొత్త చైర్మన్ ను ఎన్నుకునేలా కోటంరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వరకు మేయర్ మీద అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేయించే ప్రయత్నాలలో కోటంరెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kotamreddy target Nellore fort