TRINETHRAM NEWS

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం

కార్యకర్తలు కష్టపడాలి.. భవిష్యత్తు మనదే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం

హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మేల్యే అంజయ్య

కార్యకర్తలు కష్టపడాలి..
భవిష్యత్తు మనదే ఇది నిజం తథ్యం.. అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో ఏర్పాటుచేసిన నియోజకవర్గం టిఆర్ఎస్ కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హరీష్ రావు స్థానిక మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ నలుమూలల నుండి బీఆర్ఎస్ అన్ని విభాగాల శ్రేణులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజున ఇక్కడికి రావడంతో ఆతని త్యాగం గురించీ స్మరించుకున్నారు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ అనీ వారికి జోహార్లు అర్పించారు.
చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణా సాధించారని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం అయ్యాడు. ఉద్యమ కారులపైకి తుపాకి పట్టుకొని వెళ్లిన వ్యక్తి సీఎం అయ్యాడని పేర్కోన్నారు. షాద్ నగర్ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొందని బిఆర్ఎస్ పార్టీకి కూడా అండగా ఉందని గుర్తు చేశారు. మొన్న 7 వేల ఓట్లతో ఓడిపోయాం, కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారని తెలిపారు. గెలుపు ఓటములు ఉంటాయనీ అధికారం, ప్రతిపక్షం ఏది అయినా మనం ప్రజల పక్షం ఉందామని ధైర్యం నూరి పోశారు. వారి వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం
కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంటలో ఉంటం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చినం. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ, మార్పు అని ఎన్ని మాటలు చెప్పారు. ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. మళ్లీ స్పీడ్ అందుకుంటాం.. కేఅర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించారని పేర్కోన్నారు. కేసీఆర్ నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారనీ ఆరులో 13 గ్యారెంటీలు ఉన్నాయనీ రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారని వివరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 50 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 2500 ఇవ్వడం లేదు. బడ్జెట్ లో నిధులు పెట్టలేదు.
గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ మోసం చేస్తున్నదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారు. ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశాడు, హామీల అమలు మాత్రం చేయడం లేదు. కరోనా సమయంలో అధికారులు, ఎమ్మెల్యేలకు పైసలు ఆపి రైతులకు ఇచ్చాడు. కరోనా అప్పుడు మేము రైతు బంధు ఇచ్చాం, కానీ ఇప్పుడు ఏ సమస్యా లేకున్నా ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదు. రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా చూపిద్దాం.
ఉద్యోగాల విషయంలో సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క పోస్ట్ నింపలేదు. అవి బిఆర్ఎస్ పాలనవే. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేత పత్రాలతో డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారనీ, వాస్తవాలు బయట పెడితే, తిట్టడం మొదలు పెట్టారు. అబద్ధాలు తప్ప నిబద్దత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి కూడా మేము చేశాం, వాళ్ళు చెప్పినవి కూడా చేయడం లేదు. కాంగ్రెస్, తెలుగు దేశం పాలకులు 1984 నుండి 2014 దాకా ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. వారు 27,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, మేము పదేళ్లలో 6.36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పనులు పూర్తి అయ్యాయి. కాలవలు తవ్వితే నీళ్ళు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఆ పని పూర్తి చేయాలి నీళ్ళు ఇవ్వాలి. బిజెపి కాంగ్రెస్ రెండు పాలమురును మోసం చేశాయి. జాతీయ ప్రాజెక్ట్ తేవడంలో రెండు పార్టీలు విఫలం. బి ఆర్ ఎస్ వచ్చాకనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. 21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. నెలకు 10 వేలు వారికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. వ్యంగం బంద్ చేసి, భూతులు బంద్ చేసి రైతుల మీద ప్రేమ చూపాలి.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు. బి ఆర్ ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు. మహబూబ్ నగర్ ఎంపి స్థానం బిఆర్ఎస్ గెలవాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాజా వరప్రసాద్, రాజ్యలక్ష్మి తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు..