TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ అల్లూరిజిల్లా ఇంచార్జ్ : (మణిబాబు ) అల్లూరిజిల్లా (పాడేరు ) . జివో నెం.3 వలన జరిగే నష్టాలను,గ్రహించి ఈ చట్టం పటిష్టంగా అమలు పరుచుకునే విధంగా మన గిరిజనులందరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని (TSF), ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు మీడియా ముందు చెప్పారు. రిజర్వేషన్ అంశం మన గిరిజన ఉపాధ్యాయ మరియు నిరుద్యోగుల, సమస్య మాత్రమే అని మనం భావిస్తున్నాం కానీ, ఇది అందరి సమస్య అన్ని రకాల చదువులు, చదివిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. జీవో నెంబర్ 3 అమలులో లేకపోవడం వల్ల, ఐ. సి. డి. ఎస్ జాబ్స్, పాడేరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జాబ్స్, పాడేరు మెడికల్ కాలేజీ జాబ్స్, ఏకలవ్య టీచర్స్ జాబ్స్ మనకు రాలేదు. రీసెంట్ గా వచ్చిన కేజీబీవీ నోటిఫికేషన్ లో కూడా మన ఎస్టీ వారికి జాబ్స్ చూపలేదు. ఇలా అన్ని డిపార్ట్మెంట్ జాబ్స్ మనకు లేవు. అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అంశం మీద ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. తెలియని వాళ్లకు అవగాహన కల్పించండి అని, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, జాన్ వెస్లీ మరియు అల్లూరి జిల్లా ఇంచార్జ్, పి. సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App