TRINETHRAM NEWS

స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

పెద్దపల్లి, జనవరి 7: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని మహిళా సంఘం సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పేద మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం స్త్రీ నిధి సంస్థ ఏర్పాటు చేసిందని, మహిళలు స్త్రీ నిధి రుణాలను వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని, మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా ఇచ్చే అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండాలని అన్నారు.

మహిళా సంఘ సభ్యులకు స్త్రీ నిధి సంస్థ ద్వారా రుణాలను అందించే విధంగా స్త్రీ నిధి సిబ్బంది, మెప్మా సిబ్బంది చూడాలని, ప్రతి సంఘ సభ్యురాలు జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలని, సమాఖ్య సంఘాల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి పొదుపు రుణాల రికవరీ 100 శాతం జరిగేలా చూడాలని, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలను అందించే సంఘ సభ్యులు ఆర్థిక సస్థిర జీవనోపాదులు పెంపొందించాలని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి సుల్తానాబాద్, మంథని పట్టణ ప్రాంతాలలో మొత్తం 213 మహిళ సమాఖ్యల కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 6 కోట్ల 11 లక్షల రుణాలను స్త్రీ నిధి ద్వారా అందించడం జరిగిందని అన్నారు.

రామగుండం పట్టణ సమాఖ్యలో 13 సంవత్సరాల తర్వాత స్త్రీ నిధి రుణాలు అందుబాటులోకి తెచ్చామని, రామగుండం సమాఖ్య సభ్యులందరూ రుణాలను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

*3 లక్షల సౌభాగ్య రుణంతో కిరాణా షాపు
పెద్దపల్లి పట్టణ మహిళ సమాఖ్య లోని సి.హెచ్ స్వతంత్ర భారతి స్త్రీ నిధి ద్వారా 3 లక్షల రూపాయల సౌభాగ్య రుణం పొంది కిరాణా షాపు పెట్టుకున్నామని, కిరాణా షాపుతో జీవన విధానం మెరుగుపడిందని, తక్కువ వడ్డీకి రుణం మంజూరు చేసిన స్త్రీ నిధి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

*బోటిక్ మరియు టైలరింగ్ జీవనోపాధి
సుల్తానాబాద్ మహిళా పట్టణ సమాఖ్య చెందిన కొండా రాధా శ్రీనిధి సంస్థ ద్వారా మూడు లక్షల రూపాయల సౌభాగ్య రుణం పొంది బోటెక్ మరియు టైలరింగ్ జీవనోపాధి పెట్టుకోవడం జరిగిందని, దీని వల్ల కుటుంబ ఆర్థిక అవసరాల తీరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

*13 సంవత్సరాల తర్వాత రామగుండం పట్టణ మహిళా సమాఖ్యలో స్త్రీ నిధి రుణాలు

రామగుండం పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లతా మోహన్ అధికారుల చోరువతో 13 సంవత్సరాల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి రుణాలు అందించడం ప్రారంభించారని, దీనివల్ల మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాల కోసం వెళ్లడం లేదని, అతి తక్కువ వడ్డీకి స్త్రీ నిధి రుణాలు లభించడం చాలా సంతోషంగా ఉందని, స్త్రీ నిధి రుణాలు అందించడంలో చెరువు చూపించిన అదనపు కలెక్టర్, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App