TRINETHRAM NEWS

Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్14‌ను ప్రయోగించనుంది. జీఎస్ఎల్వీ ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా ఇస్రో షేర్ చేసింది. జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది.