ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ కే. సదానందం ఆధ్వర్యంలో INTUC ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం .
ముఖ్య అతిథులుగా హాజరైన సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ .
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో జరిగిన ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం లో ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు
INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్
మాట్లాడుతూ..
కార్మికుల హక్కుల సాధన యూనియన్ బలోపేతం కోసం ప్రతి ఒక్క నాయకులు పని చేయాలని కోరారు
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా పాలన ఏర్పడిన తరువాత పెండింగ్ లో వున్న అనేక హక్కులు సాధించామని అన్నారు.
ముఖ్యంగా కార్మికుల సమిష్టి కృషి పలితంగా ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉత్పత్తి లాభాలు సాధించటమే కాకుండా కార్మికుల కోసం
డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35-40 ఏళ్ల పెంపు , రామగుండం లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్లు , ఒడిసా లో నైని ప్రాజెక్టు నిర్మాణం , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు , కోటి రూపాయల ప్రమాద భీమా , స్థానికులకే 80% ఉద్యోగాలు , సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకం వంటి అనేక కార్యక్రమాలు చెప్పటామని సింగరేణి కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ 796 కోట్లు లాభాలు ఇవ్వటం తో పాటు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ శ్రీధర్ బాబు కృషి పలితంగా కాంట్రాక్టు కార్మికుల కి కూడా లాభాలలో నుండి 5000 రూపాయలు ఇప్పించామని. అలాగే భవిష్యత్ లో కూడా రామగుండం లో 1000 క్వార్టర్లు తో గేటెడ్ కమ్యూనిటీని తరహా నిర్మాణాలు చేపడతామని అలాగే కార్మికుల చిరకాల వాంఛ అయినా PERks మీద ఐటీ మినహాయింపు, సొంత ఇంటి కళ వంటి వాటి అమలు పై కృషి చేస్తున్నామనితెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్జీ-1 బ్రాంచ్ నుండి 400 మంది హాజరు కాగా నాయకులు ధర్మపురి, వంగ లక్ష్మిపతి గౌడ్, వడ్డేపల్లి దాస్, వికాస్ కుమార్ యాదవ్, కొత్త సత్యనారాయణ రెడ్డి ,ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ , పోచయ్య , గండ్ర దామోదర్, సమ్మయ్య యాదవ్, అన్వేష్, శారద, మల్లికార్జున్, జగన్మోహన్, గుండేటి శ్రీనివాస్, ఎదులాపురం శ్రీనివాస్, బేబీ శ్రీనివాస్ , మండ రమేష్, పుట్ట రమేష్ , సంపత్, ఆంజనేయులు, సిరిపురం నర్సయ్య, రాజేశం, సదానందం, అశోక్, మురళి, ఆంజనేయులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App