Inclusion of youth in NCP party
గోదావరిఖని పట్టణంలోని ఎన్సీపీ పార్టీ ఉత్తర
తెలంగాణ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు ఆధ్వర్యంలో
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పోరేషన్ 46వ డివిజన్ కాకతీయ నగర్ కు చెందిన యువ నాయకులు మొలుగూరి మహేష్ ఎన్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ముఖ్య అతిథిగా హాజరై మొగులూరి మహేష్, తన అనుచరులకు ఎన్సీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కల యువకులకు ఎన్సీపీ పార్టీ ఆహ్వానం పలుకుతుందని, భవిష్యత్తులో మంచి పదవులు లభిస్తాయని, యువనాయకులకు కార్పోరేషన్ ఎన్నికలలో కార్పోరేటర్లుగా పోటీ చేయడానికి అవకాశాలు లభిస్తాయని” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, ముజాహిద్ లు పాల్గొనగా, కాకతీయ నగర్ కు చెందిన యువ నాయకులు మొలుగూరి మహేష్, జిల్లాల అక్షయ్, ఒంటేరు మనోజ్, ఆరెపల్లి కౌషిక్, యండి.యూసుఫ్, ఇసకపల్లి వస్తిత్, ఆరెపల్లి రమేష్, దుర్గం సంజయ్ తదితరులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App