TRINETHRAM NEWS

యమునలో మన్మోహన్‌ అస్థికల నిమజ్జనం..

Trinethram News : దిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్థికలను ఆయన కుటుంబసభ్యులు ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. మజ్ను కా తిలా గురుద్వారా సమీపంలోని అష్ట్‌ ఘాట్‌ వద్ద సిక్కు సంప్రదాయాలను అనుసరించి ఆ తంతును పూర్తిచేశారు.

మన్మోహన్‌ సతీమణి గురుశరణ్‌ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపిందర్‌ సింగ్, దమన్‌ సింగ్, అమృత్‌ సింగ్, మరికొందరు బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత చిత్రాలను కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. దేశానికి అందించిన సేవలు, నిరాడంబరతకుగాను మన్మోహన్‌ను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారంటూ వ్యాఖ్య జోడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App