TRINETHRAM NEWS

ద్వారకా తిరుమల/యర్నగూడెం,
తేదీ : 27.02.2024.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం, వారే పార్టీకీ వెన్నెముక అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బలమైన సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 175 కి 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో గోపాలపురం నియోజకవర్గం ఇన్చార్జి గా హోంమంత్రి తానేటి వనితను నియమించారు. గత నెల 25న నియోజక వర్గంలో ద్వారకా తిరుమల మండలం తొలి పర్యటన నుండి సోమవారం నల్లజర్ల మండలం పర్యటన వరకూ నాయకులు, కార్యకర్తలతో భేటీలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ కి కొంతకాలంగా దూరంగా ఉంటున్న కొద్దిమంది పార్టీ నాయకులను కలిసి వారిని తిరిగి యాక్టివ్ అయ్యేలా చేశారు. నాయకులు కాకుండా కార్యకర్తలను సైతం దగ్గరకు చెరదీసారు. ఈ క్రమంలో ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం పర్యటనలో గ్రామానికి చెందిన బయ్యరపు ఏడుకొండలు (తండ్రి : పెద్ద దుర్గయ్య) అనే కార్యకర్త ఇటీవల మృతి చెందిన విషయం హోంమంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చాను. చిన్నస్థాయి కార్యకర్త ఇంటికి కూడా హోం మంత్రి వచ్చి పరామర్శించడం, వారికి భరోసా ఇవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…