Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు..
ఈ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ (Sampath Kumar) పరిశీలిస్తున్నారు. తిరువూరు, నందిగామ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నారు.
మైలవరం నియోజకవర్గం ఈవీఎంలను నిమ్రా మెడికల్ కాలేజీకి తరలిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు. విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గం ఈవీఎంలను ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఏడు నియోజకవర్గ ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నామని రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు.