ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయంగా మారాయి
ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ముఖ్యంగా మెసెజ్,ఆడియో, వీడియో ఫైల్స్, యూపీఐ సహాయంతో పేమెంట్ చేసే సౌకర్యాన్ని ఇప్పటివరకు కలిపిస్తుంది
ఇక తాజాగా మెటా వాట్సాప్లో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్బట్ను లాంచ్ చేసింది.ఈ ఏఐ చాట్ బోట్ తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది