తేదీ:18/01/2025.
ఘనంగా వర్ధంతి
తిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో బస్టాండ్ సెంటర్ నందు సీనియర్ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి నీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు ఘనంగా జరిపించడం జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. పండ్లు ప్రసాదాలు వచ్చిన వారికి అందజేశారు. ఆయన్ని ప్రతి ఒక్కరూ మనసులో తలుచుకుంటూ ఆయన చేసిన ప్రజాసేవ గురించి కొనియాడారు చిరకాలం ప్రజల హృదయాలలో ఊపిరిగా ఉన్న వ్యక్తి ఆయనే. వచ్చిన ప్రతి ఒక్కరూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. వాహనాలకు అంతరాయం కలగకుండా చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App