TRINETHRAM NEWS

రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు.!

వెల్లడించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి

మంథని ముత్తారం రహదారి నిర్మాణానికి రూ. 60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మైదబండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్తారం మండలంలోని ఓడేడు నుండి మంథని వరకు ఇబ్బందికరంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు కాగానే ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపి, ఓడేడు నుంచి మంథని వరకు పూర్తిస్థాయిలో రూ. 60 కోట్లతో నిధులు మంజూరు చేపించామన్నారు.

ఈ రోడ్లకు సహకరించిన ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముత్తారం ప్రజలందరి తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో భాగంగా ఎక్కడైతే గ్రామాలకు రోడ్లు వస్తాయో, అక్కడ మీడియంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. నాణ్యతతో కూడిన రోడ్లను నిర్మాణం చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. వారి వెంట డీసీసీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా, ఎస్ ఎస్ సి ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, యూత్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ మాజీ సర్పంచులు తూటి రజిత రఫీ, వేల్పూరు సంపత్ రావు, తాటిపాముల వకుల రాణి శంకర్, ఆకోజు అశోక్ చారి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App