TRINETHRAM NEWS

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందరికీ చూడాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూసఅర్హత కలిగిన ఏఒక్కరిని కూడా మిస్ చేయకుండా ,ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
బుధవారం ఎంపీ డి ఓ లు, ఏం ఆర్ ఓ లకు టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్కులర్ మెమో ప్రకారం ప్రణాళిక సిద్ధం చేయాలనీ, దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
బుధవారం ఏం పి డి ఓ లు, ఏం ఆర్ ఓ లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జిల్లా లో రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏం పి డి ఓ, ఏం ఆర్ ఓ లు మున్సిపల్ కమీషనర్ లతో సమన్వము చేసుకొని రేపటి లోగా లిస్ట్ ఆవుట్ చేయాలనీ, ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి పూర్తి చేసిన లిస్ట్ ను సూపర్ చెక్కింగ్ పూర్తి చేయాలన్నారు. గ్రామ సభలు, వార్డ్ సభలకు బృందాలను ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు.
రుణ మాఫీ, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాల గురించి గ్రామం వారీగా, వార్డ్ వారీగా లిస్ట్ రెడీ చేయాలన్నారు.. ఏం ఆర్ ఓ లు కమిటీ లు ఏర్పాటు చేసి పూర్తి చేసిన లిస్ట్ ను సూపర్ చెకింగ్ చేసి పూర్తి చేయాలనీ మండల అధికారులకు ఆదేశించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App