TRINETHRAM NEWS

Functions should be coordinated to reduce the crime rate

వార్షిక తనిఖీల్లో భాగంగా లక్షేట్టిపేట సీఐ ఆఫీస్, లక్షేట్టి పేట్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీయస్

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి

క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనర్ మొదట పోలీసు వందనాన్ని స్వీకరించి అనంతరం లక్షేట్టి పేట్ రూరల్ సీఐ ఆఫీస్, లక్షేట్టిపేట పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసరప్రాంతాల పరిశీలించారు. 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5s ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. నామినల్ రోల్స్ ను పరిశీలించి హెచ్ఆర్ఎసి తనిఖీ చేసి హెచ్ఆర్ఎంఎస్ లో అలర్ట్ చేసిన డ్యూటీల ప్రకారం నామినల్ రోల్లో ఉండాలని తెలిపారు. మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ….. విధినిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు ప్రతినెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మరియు ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాది దారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు.

రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని బైండోవర్ చేయాలని రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలన్నారు, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిసీటిఎన్ఎస్ (క్రైమ్ మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్& సిస్టం) ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు.

అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ఎంఎస్ గ్రీవెన్స్ సెల్ ద్వారా పంపించాలని హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ డిసిపి, ఏసిపి మరియు పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ లక్షేట్టిపేట సీఐ ఎ. నరేందర్ , ఎస్ఐ సతీష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Functions should be coordinated to reduce the crime rate