సినిమా ఛాన్స్ కోసం వెళ్లిన మహిళకు
Trinethram News : హైదరాబాద్ : జనవరి 18 : ఒక్క ఛాన్స్ అంటూ సినిమా రంగంలోకి అనేక మంది వస్తుంటారు. ఒక్క ఛాన్స్ రాకపోదా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కుంటుంటారు. వీరి టాలెంట్‌ను కొంత మంది వేరే విధంగా ఉపయోగించుకుంటారు. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతుంటారు. వారి వద్ద అందిన కాడికి డబ్బులు తీసుకుని ఆపై వారిని పట్టించుకోవడం మానేస్తారు. ఇక మహిళల విషయానికి వస్తే.. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఛాన్స్ కోసం ప్రతి ఒక్క చోటుకు వెళ్తుంటారు మహిళలు. ఇదే అవకాశంగా చేసుకుని కొందరు వ్యక్తులు వీరిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి.
ఏపీకి చెందిన ఓ మహిళ సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌కు వచ్చింది. తొలుత మణికొండలో నివాసం ఉన్న మహిళ తరువాత అమీర్‌పేట్‌కు షిఫ్ట్ అయ్యింది. ఈ క్రమంలో సినిమాల్లో ఛాన్స్ అంటూ ఓ వ్యక్తి ఆమె పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాలో నటించాలని కోటి ఆశలతో నగరానికి వచ్చిని ఏపీకి చెందిన మహిళకు ఊహించని షాక్ తగిలింది. మణికొండలో ఉంటూ కృష్ణానగర్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో మణికొండ నుంచి 15 రోజుల క్రితమే అమీర్‌పేట్‌కు షిఫ్ట్ అయ్యింది మహిళ. ఆ తరువాత డైరెక్షన్ విభాగంలో ఒక వ్యక్తితో మహిళకు పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మబలికాడు సదరు అసిస్టెంట్ డైరెక్టర్. సినిమాల్లో నటించాలంటే ముందుగా ఆడిషన్స్ ఉండాలని మహిళకు చెప్పాడు.
ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
ఆడిషన్స్ కోసం మూడు రోజుల క్రితం ఒక హోటల్‌కు పిలిపించాడు అసిస్టెంట్ డైరెక్టర్. సినిమాల్లో ఛాన్స్ వస్తుందనే ఆశతో మహిళ హోటల్‌కు వెళ్లింది. మొదటి రోజు యాధావిధిగా మహిళపై ఫోటో షూట్ చేసి అతడిపై నమ్మకం వచ్చేలా చూసుకున్నాడు. ఆ తరువాతే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అసలు రంగు బయటపడింది. మరిసటి రోజు కూడా ఫోట్ షూట్ ఉంటుందని భావించి హోటల్‌కు వచ్చిన మహిళపట్ల అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడిషన్స్ పేరుతో గదిలోకి పిలిచి అత్యాచారం చేశారు. తనకు జరిగిన ఘోరంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App