TRINETHRAM NEWS

First use of narcotic dogs in community contact program

ఇంద్రనగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ డాగ్స్​ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ, అదేశాల మేరకు, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా కాలనీ లో ఇండ్లలలో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏ సి పి గారు మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామంలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువ త్రాలను కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై మరియు వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ మరియు షీ టీమ్ , డయల్ 100 గురించి అవగాహన కల్పించడo జరిగింది.

యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా కఠిన చర్యలు తీసికోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మత్తు పదార్థాల కట్టడికి తొలిసారి నార్కోటిక్​ ​(మత్తు పదార్థాలను గుర్తించుటకు శిక్షణ పొందిన) డాగ్స్ ను కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో వినియోగించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రవీందర్ గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, గోదావరిఖని ఎస్ఐ లు సమయ్య, శ్రీనివాస్, సుగుణకర్, గోదావరిఖని టూ టౌన్ ఎస్ఐలు సనత్ రెడ్డి, వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు హాజరైనారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First use of narcotic dogs in community contact program