TRINETHRAM NEWS

Fertilizer seized illegally

Trinethram News : Jul 19, 2024,

చెన్నూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి 63 మీదుగా నాలుగు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల ఎరువులను గురువారం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు.. జాతీయ రహదారి వద్ద తనిఖీలు చేపట్టినట్లు సీఐ రవీందర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను పట్టణంలోని కామాక్షి ట్రేడర్స్, లక్ష్మీవెంకటేశ్వర్ ఎరువుల దుకాణాల నుంచి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి ఆన్లైన్ బిల్లులు లేకపోవడంతో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ విచారణ జరిపినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎరువులు, వాహనాలను స్థానిక
పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fertilizer seized illegally