ఖని,లో రోడ్డు ప్రమాదం లో తండ్రి ,కుమారుడు మృతి.
అజాగ్రత్తగా పార్కింగ్ చేసిన లారీ ని డికొట్టిన కార్ మృతుడు సింగరేణి ఉద్యోగి . మరి ముగ్గురికి తీవ్ర గాయాలు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని1 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఎం ల్ ఏ క్యాంపు కార్యాలయం రహదారి పై సోమవారం తెల్లవారు జామున జరిగిన రొడ్డు ప్రమాదం లో అంబేడ్కర్ నగర్ కు చెందిన సింగరేణి ఉద్యోగి గిన్నరాపు సతీష్ (32),అతని 11 నెలల కుమారుడు నవిష్ మృతిచెందాడు.వివరాలలోకి వెళ్తే..అంబేద్కర్ నగర్ కు చెందిన జీడీకే 11 ఇంక్లైన్ ఉద్యోగి గిన్నారపు సతీష్ ,అతని భార్య కీర్తి,అతని కుమారుడు నవీష్ , సతీష్ బావ 8 వ కాలనీ కి చెందిన సింగరేణి ఉద్యోగి ఆత్కూరి సతీష్,అతని భార్య అనూష కలిసి ఆతుకూరి సతీష్ కు చెందిన స్విఫ్ట్ కార్ (నంబర్ టీ ఎస్ -09 ఈ జి 5454) నంబర్ గల కార్ లో గిన్నారపు సతీష్ కు వరుసకు సోదరుడైన కిన్నెర చందు కు పాప పుట్టడం తో హైదరాబాద్ కు చూసేందుకు వెళ్లారు.
తిరిగి ఆదివారం రాత్రి 11 గంటలకు తిరిగి వస్తున్న క్రమంలో కార్ ను గిన్నారపు సతీష్ నడుపుతుండగా ,ముందు సీట్ లో సతీష్ బావ ఆత్కూరి సతీష్ కూర్చోగా ,వెనక సీట్ లో గిన్నారపు సతీష్ భార్య కీర్తి ,కుమారుడు నవీష్,ఆతుకూరి సతీష్ భార్య అనూష లు కూర్చున్నారు.సోమవారం తెల్ల వారు జామున 3 గంటలకు గోదావరి ఖని ఎం ల్ ఏ క్యాంపు కార్య లయం సమీపంలో ని రోడ్ వద్దకు చేరుకున్నారు.ఈ సమయం లో క్యాంపు కార్యాలయం రోడ్ నుంచి డివైడర్ వైపు కుక్క అడ్డుగా వచ్చింది.ఈ సమయం లో కార్ నడుపుతున్న సతీష్ ఒక్కసారిగా కార్ ను ఎడమవైపు తిప్పాడు.ఆ సమయం లో ఎలాంటి హెచ్చరికలు,పార్కింగ్ లైట్లు వేయకుండా ఆగి ఉన్న MH 49 AT 8225 నంబర్ గల ఉప్పు బస్తాల లారీ ని బలం గా ఢికొట్టింది.
దీంతో కార్ నడుపుతున్న సతీష్ తలకు బలమైన గాయాలయ్యాయి ,వెనకాల కూర్చున్న సతీష్ కుమారుడు నవీష్ కు సైతం బలమైన గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్సు లో అందరినీ గోదావరిఖని లోని ధర్మాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గిన్నరపు సతీష్,అతని కుమారుడు నవీష్ లు మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన ఆతుకూరి సతీష్ ,అనూష ,గిన్నరపు కీర్తిలను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.మృతిని సోదరుడు అంబేద్కర్ నగర్ కు చెందిన ఉదయ్ పిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై 125(a),106 బి ఎన్ ఎస్. ప్రకారం కేసు నమోదు చేసినాము.అనంతరం మృతులకు ప్రభుత్వ ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించాము రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయరాదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App