ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు బాలికల వసతి గృహంలో ఘటన.. నిందితుడి అరెస్టు
Trinethram News : హైదరాబాద్ శివారులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. రాత్రి వేళ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్‌లో బుధవారం అర్ధరాత్రి ఈదారుణం జరిగింది. మంగల్‌పల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సమీపంలోని (మంగల్‌పల్లి గేట్ దగ్గర) ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది.
నల్లగొండ జిల్లాకు చెందిన అజిత్ (22) ఆ హాస్టల్ భవన యజమాని దగ్గర గతంలో డ్రైవర్‌గా పని చేసి, మానేసిన అజిత్.. బుధవారం రాత్రి ఆ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. బాధిత విద్యార్థిని తన గదిలో ఒంటరిగా ఉండగా.. బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. పక్క గదుల్లో ఉన్న యువతులు.. డయల్ 100కు ఫోన్ చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసులు నమోదు చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App