ఇండ్లు లేని 700 మంది నిరుపేదలకు కబ్జా గురైన ప్రభుత్వ భూమిని వెలికి తీసి ఇవ్వాలి
Trinethram News : బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ మాట్లాడుతూ. గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మహేష్ మాట్లాడుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 735 లో మొత్తం విస్తీర్ణం 105 ఏకరలు ఉండగా రామాలయం గుట్ట వెనుకాల మిని స్టేడియం మరియు గురుకుల పాఠశాల కు 14 ఎకరాలు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయలకు కేటాయించిన భూమిని అగ్రవర్ణాలకు చెందిన కొంత మంది వ్యక్తులు తమ వర్గం యొక్క ఆధిపత్యాన్ని చలయిస్తు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని ఫంక్షన్ హాల్ మరియు మామిడి తోటలు పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసుకొని యదేశ్ఛగా అనుభవిస్తున్నారని వివరించారు అదే ఇండ్లు లేని నిరుపేదలు జీవనమే కష్టంగా ఉన్నటు వంటి నిరుపేదలు గుడు కోసం గుంట భూమిలో తాత్కాలిక గుడిసెలు గుడారాలు వేసుకుంటే స్థానిక శాసన సభ్యులు హుటా హుతిన ఆదేశాలు జారీ చేశారు వెంటనే వెంటనే అధికారులు నీరు పేదలకు నోటీసులు జారీ చేయడం ఆదే బడ బాబులకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని చెప్పారు వెంటనే కలెక్టర్ చోరువ తీసుకొని అక్రమ నిర్మాణాలను కుల్చివేయలని కోరారు అదే విధంగా గొల్లపల్లి గ్రామంలో సుమారు 700 మంది పేదలకు ఇండ్లు లేవని కబ్జా గురైన ప్రభుత్వ భూమిని వెలికి తీసి ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App